జాతకం అంత బాగున్న మనకి ఎందుకు అన్నీ కష్టాలే వస్తున్నాయి.
చాలా మంది జ్యోతిష్యం చూపించుకుంటారు.జాతకం అంత చాలా బాగుంటుంది కానీ ఏ పనులు జరగవు.అలాగే ఎన్ని పరిహారాలు చేసిన ఫలితం ఉండదు ఎందుకో అర్థం కాదు.అన్ని విషయాలలో మనకి కష్టం అవుతునే ఉంటుంది ,ఎందుకు ఇలా జరుగుతుంది.
మన పెద్దలు అంటారు ఎదైనా పని చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఎందుకు అంటారు అల? ఏ తరం లో ఒకరు తప్పు చేసిన ఆ పాపం మనం అనుభవిస్తాము.కొంతమంది తెలిసో తెలియకో తమ మాటల వల్ల కొంతమందిని ఇబ్బంది పెడతారు.తమ పనుల వల్ల ఇబ్బంది పెడ్తారు.మన వల్ల తెలిసో తెలియకో ఒక అమాయకుడు లేదా ఒక మంచి వాడు బాధపడిన ఆ పాపం ఇలా వేదిస్తు ఉంటుంది .జాతకం అంత బాగనే ఉంటుంది కానీ ఎం జరగదు.ఇలా మీకు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిరోజూ శివ అపరాధ సొత్రo చదవండి.అలాగే ప్రతిరోజూ జంతువులకి,మనుషులకి తినడానికి ఏమైనా పెట్టండి.ప్రతి అమావాస్య రోజు పితృ దేవతలకు తలుచుకొని కాకి కి ఏమైనా పెట్టండి.పుణ్య క్షేత్రాలు సందర్శన చేయండి అక్కడ ఏమైనా సేవ చేయండి అన్నదానం చేయండి.మానవ సేవ మాధవ సేవ అధి గుర్తు పెట్టుకోవాలి.ఎవరిని కించపరచడం ,బాధ పెట్టడం చేయకండి.
Comments
Post a Comment