అమ్మ
ఈ కథ నేను ఎప్పుడో విన్న కథ,చాలా మందికి తెలిసిన కథ కావచ్చు చాలామందికి తెలియల్సిన కథ కావచ్చు ...
అనగనగా ఒక రాజ్యం లో ఒక అబ్బాయి ఉండేవాడు ,తనకి తండ్రి లేరు చిన్నపుడు యుద్ధం లో చనిపోతారు ,అమ్మ చాలా కష్టపడి అబ్బాయ్ నీ పెంచుతుంది.అల రోజులు గడుస్తున్నాయి .అమ్మ ముసలిది అవుతుంది ,ఒకరోజు అబ్బాయ్ నీ అమ్మ పిలిచి ఈ ఒక్కరోజు నా పక్కన పడుకో నాన్న అంటుంది ,దానికి ఎం ఉంధి అమ్మ అలాగే పడుకుంటాను అని పడుకుంటాడు అమ్మ అంటుంది నాన్న ఈరోజు నేను ఎం చేసిన విస్సుకోవు కదా మాట ఇవ్వు అంటుంది ,అమ్మ నేను ఎందుకు విస్సుకుంటను ,అస్సలు అల చేయను అంటాడు లేదు నాన్న మాట ఇవ్వు అంటుంది సరే అమ్మ నేను ఎం అనాను అని మాట ఇస్తాడు ,అమ్మ నాన్న లేకపోయినా నన్ను ఇంత వాడిని చేశావు నిన్ను కంటికి రెప్పల చూసుకుంటాను అస్సలు ఎం అనను అని చెప్తాడు ,సరే నాన్న నా బంగారం అని అమ్మ అంటుంది ,సరే అమ్మా పడుకో ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు అప్పుడు అమ్మ నాన్న నాకు ఎదైనా ఒక కథ చెప్పవా అని అడుగుతుంది .నీకు కథ ఎందుకు అమ్మ అని అంటాడు నాకు వినాలి అనిపిస్తుంది రా చెప్పు అంటే సరే అని చెప్తాడు ,ఇంకోటి చెప్పు నాన్న అంటుంది కొంచం అయిష్టం తోనే చెప్తాడు ,సరే అమ్మా పడుకో ఇంకా అంటాడు , తర్వత అమ్మ నాన్న నాకు దాహం వేస్తుంది నీరు ఇవ్వవా అని అడుగుతుంది సరే అని తెచ్చి ఇస్తాడు కాసేపు అయ్యాక మళ్ళీ నీరు అడుగుతుంది మళ్ళీ తెచ్చి ఇస్తాడు తాగుతుంటే నీరు మొత్తం బట్టల పైన మంచం పైన పడిపోతాయి అయ్యో నాన్న చేయి జారింది ఎం అనుకోకు రా కొంచం బట్టలు మార్చు చల్లగా అయ్యాయి అంటుంది సరే అమ్మా అని బట్టలు కింద పక్క బట్టలు అన్నీ మారుస్తాడు,మళ్ళీ పడుకుంటారు మళ్ళీ నీరు అడుగుతుంది మళ్ళీ same అలాగే చేయి జారీ నీరు అంతా పడిపోతాయి కొంచం కోపం తోనే మళ్ళీ అంత శుభ్రం చేసి పడుకో అమ్మ అంటాడు.మళ్ళీ మూత్రం వస్తుంది నాన్న కొంచం తీసుకొని వెళ్ళు అని అడుగుతుంది ,తీసుకొని వెళ్తాడు వచ్చి పడుకుంటుంది ,మళ్ళీ నాన్న నాకు నిద్ర రావడం లేదు ఏమైనా మాట్లాడు అని అడుగుతుంది ,ఇంకా అబ్బాయ్ కి కోపం చిరాకు అన్ని వచ్చి బాగా తిడతాడు ఎంటి అమ్మ తమాషా గా ఉందా ఎన్ని సార్లు అని నీరు అడుగుతావు,పక్క తడుపుతావు,కథలు చెప్పు అంటావు ఎంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా చేస్తే ఒక నిమిషం కూడా నేను నిన్ను చూసుకోలేను అని గట్టి గట్టిగా అరుస్తాడు.అప్పుడు అమ్మ అంటుంది ఇప్పుడే కదా కంటికి రెప్పల చూసుకుంటా అన్నావు ఇప్పుడు ఎం అయ్యింది అని అడుగుతుంది.అప్పుడు అబ్బాయ్ ఇలా విశిగిస్తే ఎలా చూసుకుంటారు అని అంటారు.అదే రా అమ్మకి బిడ్డలకు ఉన్న తేడా. ఇలా నువ్వు చిన్నపుడు ఎన్ని సార్లు చేసి ఉంటావు ఎన్ని సార్లు నా పక్క నా చీర తడిపి ఉంటావు.ఎన్ని సార్లు నాకు నిద్ర లేకుండా చేసి ఉంటావు .అయిన ఓపిక గా అమ్మ చేయగలదు ,కానీ అమ్మకి పిల్లలు చేయలేరు అని చెప్తుంది అప్పుడు అబ్బాయ్ కి చాలా బాధ అనిపిస్తోంది.మనల్ని మన అమ్మానాన్న చూసుకున్నప్పుడు వాళ్ళని కూడా మనం చూడాలి కదా...............
Soo true..!
ReplyDelete