జరగబోయేది ఎలాగూ జరుగుతుంది మరి జ్యోతిష్యం ఎందుకు?????
మన నిత్య జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాము.కొంతమందికి జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది నమ్మి అన్ని చేస్తారు ,కొంతమందికి అస్సలు నమ్మకం ఉండదు వల్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ...
ఇప్పుడు ఒక 2 కథలు చెప్తాను నేను చిన్నపుడు చదివిన కథలు అవి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక ఊరిలో ఉంటారు పెళ్లి అయి చాలా years అయినా పిల్లలు ఉండరు ,చాలా పూజలు చేశాక ఒక బాబు పుడతారు ,తన జాతకం అంత చూసి అబ్బాయ్ కి నీటి గండం ఉంధి జాగ్రత అని చెప్తారు ఇంకా అంతే అప్పటినుంచి నీటి దగ్గరకి వెళ్లకుండా చూసేవారు ,నీరు అంటే బయం వచ్చేలా చేశారు , నది ప్రయాణం, సముద్ర ప్రయాణం ,చిన్న కుంటలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు అల అతను ముసలి వాడు అయ్యాడు ఒకరోజు అన్నం తినేటప్పుడు నీరు తాగుతుంటే పొలమరి నీరు ఊపిరితిత్తులకు వెళ్లి చనిపోతాడు ...ఇక్కడ జ్యోతిష్యం నిజం తనకి నీటి గండం ఉంధి నీటితోనే చనిపోయారు .......
ఇంకో కథ లో ఒక ఒక రాజ్యం లో రాజు కి అబ్బాయ్ పడుతారు, ఆ రాజ్యం పేరు వరాహ రాజ్యం. కోట పైన కూడా వరాహ బొమ్మ ఉంటుంది ,జ్యోతిష్యులు అబ్బాయ్ జాతకం చూసి మీ అబ్బాయి వరాహం వల్ల చనిపోతారు అని చెప్తారు అప్పుడు రాజు బాబు నీ అస్సలు బయటికి పంపకుండా కోటలోనే ఉంచేవాడు ,తన బాల్యం అంతా కోటలోనే గడిచిపోయింది ఇలా కొన్ని years తర్వాత చాలా గాలి వాన అల వచ్చింది రాజు కోట పైన వరాహ బొమ్మ ఉండేది చాలా sharp గా ,పెద్దగా ఉండేది రాజ్యం పేరు వరాహ రాజ్యం కదా అందుకే ,అల బాబు ఆడుకుంటూ ఉంటాడు చాలా పెద్ద గాలి వచ్చి వరాహ బొమ్మ బాబు పై పడి బాబు చనిపోతారు ,ఇక్కడ కూడా జ్యోతిష్యం నిజం అయ్యింది ఎం చెప్పారో అదే జరిగింది.
మనకి నిత్య జీవితం లో జ్యోతిష్యం చాలా సహాయం చేస్తుంది మనం ముందు ఎం జరుగుతుంది అనేది తెలుస్తుంది కానీ దాన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా అనవసరపు భయాలతో బ్రతుకుతారు.ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తున్నాం అక్కడ పెద్ద గుంట ఉంధి మనకి తెలియకుండా వెళ్లి పడిపోతే ఎంత దెబ్బ తాకుతుంది అలాగే ప్రాణం కూడా పోవచ్చు జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది.అదే అక్కడ ఇలా గుంట ఉంధి అని ఒక బోర్డ్ పైన రాసి ఎవరు అయిన పెట్టీ ఉంటే మనం అగి నెమ్మదిగా వెళ్తాం ఇంకా అధి ఒకటే road ఉంది అలాగే వెళ్ళాలి గుంట ఉంది అని తెలుస్తుంది అప్పుడు గుంట లో పడాల్సిన పరిస్థితి వచ్చిన నష్టం కొంచం తక్కువ ఉండచ్చు , మనం కాసేపు అగుతాం లేదా ఎవరికైనా చెప్తాం ఎదో ఒకటి చేస్తాం. మనం అదృష్టం బాగుంటే బోర్డ్ పైన ఎటు వైపు వెళ్ళండి లేదా అటు వైపు వెళ్ళండి అని రాసి ఉండచ్చు లేదా ఎవరు అయిన వచ్చి హెల్ప్ చేయచ్చు , ఎదో ఒక విధంగా మనకి సహాయం రావచ్చు..మనం చీకటిలో ఉన్నాం అస్సలు ఎం చూడలేకపోతున్నాను అన్నపుడు ఒక తాడు మన చేయి కి తాకింది అనుకోండి అప్పుడు అధి పాము కావచ్చు అని చాలా బయం అవుతుంది అదే నీ దగ్గర ఒక దీపం లైట్ ఏమైనా ఉంటే నీకు అధి తాడు అని తెలుస్తోంది బయం కాదు ...
ఇలాగే జ్యోతిష్యం కూడా ఉపయోగపడుతుంది నువ్వు ఎలా దాన్ని అర్ధం చేసుకుంటే అల .కనులు మనకి చూపిస్తాయి బుర్ర మనకి ఎం చేయాలో చెప్తుంది మనసు ఎలా చెప్తే అల నువ్వు వింటవు.కనులు జ్యోతిష్యం బుర్ర పరిహారాలు మనసు నీ ఆలోచన ,90% జ్యోతిష్యం చెప్పిన 10 % నీ చేతిలో ఉంటుంది ...మన దగ్గర అన్ని ఉన్న మనకి తెలియకపోవచ్చు ఎవరో ఒకరు చెప్తే తెలుస్తాయి జ్యోతిష్యం లో కూడా నీకు problem వచ్చినపుడు నీ పూర్వ జన్మ పుణ్యం కావచ్చు నీ జాతకం బట్టి ఇలా చేయు అల చేయు అని చెప్పి నీ సమస్య నుంచి నిన్ను బయట పడేయడానికి ఛాన్స్ ఉంటుంది.అలాగే మంచి వాళ్ళు నీ జాతకం చూసినపుడు వల్ల మంత్ర సిద్ది , వాక్కు శుద్ధి,వల్ల చూపు అన్ని నీ కర్మ నీ తగ్గించవచ్చు...వల్ల పుణ్యం నీకు సహాయం చేయవచ్చు అందుకే పెద్ద వల్ల ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు అలాగే ఎదైనా problem అనిపిస్తే జ్యోతిష్య పండితులు దగ్గరికి వెళ్తారు...ఎది మారక పోవచ్చు కానీ సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది .......
Chala manchi ga cheparu andi
ReplyDeleteChala Baga explain chesaru with example. Need more like this blogs
ReplyDelete