April 22 నుంచీ మొదలు అయ్యే గంగ పుష్కరాలు
గంగా నది పుష్కరాలు:
భారతదేశంలో గంగా నది అత్యంత పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగమ్మ. పుష్కర స్నానం చాలా గొప్పది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది. ఎక్కడ కనిపించినా నాగ సాధువులు, అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు.
పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది.
గంగా పుష్కరం బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3, 2023న అయిపోతుంది.
బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివరి పన్నెండు రోజులు రిం ప్రత్యేకమైనవి......
బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.
పుష్కరుడు కథ
పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడు అని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థ రాజు అని పిలుస్తారు. సామాన్యులు అందరూ నది స్నానం చేయడం వల్ల ఆ నది పవిత్రత క్షీణించడానికి గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు. దాని కోసం పరమ శివుడి కోసం తపస్సు చేసి నదుల దోషములన్నిటిని ప్రక్షాళన చేసే మార్గాన్ని అర్థించాడు. అతని తప్పసుకి మెచ్చి శివుడు పుష్కరుడుకి తను కోరిన వరం ఇస్తాడు. శివుని వరం వల్ల పుష్కరుడు పవిత్రుడు మరియు అనంతమైన శక్తి ప్రాప్తించింది అవుతారు. పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడో ఆ నది పవిత్రం అవుతుంది.
నదులలోని పాపాలన్నింటినీ తొలగించ గలగే వరం లభించింది. ఆ కారణం వల్ల 12 నదులన్నీ తమలో పవిత్రత నింపాలి అని పుష్కరుడు కోరుకుంటాడు. అటుపిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టీ పుష్కరాలు నిర్ణయించబడతాయి. అంటే మిథున రాశి, వృషభ రాశి, మేష రాశి, కన్య రాశి ఎలా మోతం అన్నీ రాశిలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో, అప్పుడే పుష్కరుడు నదులలో నివసించేలా చేసుకుంటాడు. పుష్కరుడు ప్రవేశిస్తుంచిన మొదటి 12 రోజులను పుష్కరాలు అని అంటారు. ఒక సంవత్సరం పాటు ఆ నదిలో ఉంటారు కానీ ఆది పుష్కరం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక్క 2 ముహూర్త కాలంలో మాత్రమే ఉంటారు.
గంగా నది ప్రధాన పుష్కర్ ఘాట్ వాటి పేర్లు:
1. వారణాసి
2. గంగోత్రి
3. హరిద్వార్
4. బద్రీనాథ్
5. కేదార్నాథ్
6. ప్రయాగ
7. అలహాబాద్
వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.
గంగా ఘాట్లలో చేయవలసినవి & చేయకూడనివి:
1. నది ప్రాంగణాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి.
2. ఘాట్లో స్నానానికి సబ్బులు, షాంపూ use చేయకూడదు.
3. నాణేలు మరియు ఇతర వస్తువులను నదిలో వేయవద్దు.రాగి నాణేలు వేయవచ్చు.
7. ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదు.
Comments
Post a Comment