గంగ నది విశిష్టత
ఉత్తరాఖండ్ రాష్ట్రం లో హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం లో భాగీరథి నది నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని "గంగ" అంటారు.ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు చివరకు బంగ్లాదేశ్‌తో సహా అనేక భారతీయ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి రెండు ప్రధాన ప్రధాన జలాలు ఉన్నాయి, భాగీరథి నది మరియు అలకనంద నది, ఇవి ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ వద్ద కలుస్తూ గంగానదిని ఏర్పరుస్తాయి.
పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను.
అలాగే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి ,శివ కృప సంపాదించి సముద్రమును దాటెను, అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే రణరంగం లో గెలిచారు...శివ పూజ అనేది అంత గొప్పది......అలాగే నదులలో గంగానది పరమపవిత్రమైనది.........
గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు సర్వపాపహరమైనది.
గంగా జలములో స్నానము చాలా గొప్పది...
ఏ నీటినైనా గాని, "గంగ గంగ గంగ" అని మూడు సార్లు అనుకొని తల పైన చల్లుకుంటే ఆ నీళ్ళు గంగాజలముతో సమానం అవుతుంది.
గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కాబట్టి మాఘమాసములో గంగాస్నానము చాలా మంచిది..
పూర్వం ఒక కథ ఉంది మగధ రాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు.
నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు.
వారు నిండు యవ్వనవతులై ఉన్నారు. వారు కోనేరు లో స్నానము చేసేవారు. కొన్ని రోజుల తరువాత ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చారు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టుముట్టి వివాహం చేసుకోమని బలవంతము చేయగా, బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను ఒప్పుకోలేదు
అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియూ, మీరుకూడ పిశచులగుదురుగాక అని తిరిగి శాపమిచ్చుటచే వారంతా వికట రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాధించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి...
కొంతకాలమునకు ఒక సిద్దుడు ఆ కోనేటి దగ్గరకురాగా, పిశాచముల తల్లి దండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపము ఎలా పోవునని అడిగారు..
ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా, వారు ఆ విధంగా చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి.
మాఘమాస మందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను.
అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది.
ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు.
ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను.
ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి.
అది చూచి కోపంతో తపస్వి అయి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము తో ఉండు అని విశ్వామిత్రుని , పాషాణమై ఉండు అని భార్యను శపించాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖంతో ఉన్నారు. నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకి వచ్చి......
"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు.
సరే ఇంకా వెళ్లి గంగ నదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము", అని చెప్పారు విశ్వామిత్రుడు గంగాస్నానము చేసి, విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ , పొంది , హగంధర్వలోకమునకు వెళ్ళిపోయెను.
పూర్వరూపమును పొందాడు విశ్వామిత్రుడు...
మనం కూడా పుష్కరాల కి వెళ్ళలేక పోతే ఇంట్లో ప్రతి రోజూ 3 మార్లు గంగ గంగ గంగ అని అనుకొని స్నానం చేయాలి.అలాగే పుష్కరాలు జరిగే రోజులలో తప్పకుండా దాన ధర్మాలు చేయాలి .మన పితృ దేవతలను తలుచుకొని ఏమైనా దానం చేయాలి.
Comments
Post a Comment