మనలో మన మాట
మనం నిత్య జీవితంలో చూసే కొన్ని సమస్యలు, సంఘటనలు... ఇప్పటి సమాజం లో
ఒక మధ్య తరగతి మనిషి.తన చిన్నపాటి జీతం తో గడిచే కుటుంబo. తనకి స్వంత ఇల్లు కొనే స్థోమత ఉండదు , కారు కొనడం,అలాగే ఫంక్షన్స్ చేయడం ఇలా అన్ని కూడా మన స్థోమత మించి చేస్తాము, చుట్టాల ముందు దర్పం కోసం లేదా సమాజం లో ఒక పరువు ప్రతిష్ట కోసం అప్పు చేసి మరీ ఇల్లు అనేది కొంటారు అనుకుందాం...ఇల్లు కొనడం అందరినీ పిలిచి గృహ ప్రవేశం చేయడం అధి అంత బాగనే ఉంటుంది .కానీ ప్రతినెలా అప్పుకి వడ్డీ ఎవరు కట్టాలి????EMI ఎవరు కట్టాలి???ఇల్లు గడవడం కోసం ప్రతినెలా money ఎవరు ఇవ్వాలి????? వీటి అన్నిటికీ మళ్ళీ నువ్వే కష్టపడాలి.నువ్వే ఆలోచించాలి.... ఏ సమాజం కోసం నువ్వు ఇల్లు కొనడం అనే పని చేశావో అధి వాళ్ళు ఎవరు అబ్బా మంచిగా ఉన్నారు అనుకోరు ,నువ్వు అధి కొని అప్పుల పాలు అయితే అంత అవసరమా ??? డబ్బు లేపనపుడు ఎందుకు కొనాలి దర్పం కోసం కాకపోతే ,మంచిగ అయ్యింది అని ఇంకా ఎగతాళి చేస్తారు ఏ పరువు కోసం నువ్వు నీ వల్ల కానీ పని చేశావో ఆ పని వల్లే నువ్వు పరువు పోగొట్టుకుంటవు.....
ఏ పని అయిన మన కోసం మనం చేయాలి ,నీ చుట్టూ ఉన్న సమాజం గెలిస్తే ఏడుస్తారు ఓడిపోతే నవ్వుతారు అంతే ,వల్ల ముందు వల్ల కోసం ఎదో చేయాలి అని ఇంకా దిగజారి ఓడిపోవడం కంటే కాస్త నీ కోసం నిన్ను నమ్ముకున్న ఉన్న కుటుంబ సభ్యుల కోసం ఆలోచిస్తే మంచిది......
Comments
Post a Comment