మనలో మన మాట

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే అంశంపై నేను మొన్న మాట్లాడిన, నాకు అప్పుడు అనిపించింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎంటి ఎం అయిన సరే మనం ఎలా ఉన్నా సరే ఒదిగి ఉండడం అనేది మన స్వభావం అయి ఉండాలి ఎందుకు అంటే నువ్వు అందరి వల్ల అందరి సహాయం వల్ల ఎదిగావు..ఒక మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాము కృష్ణ భగవాన్ చెప్పిన మాట " ఈ కాలం గడిచిపోతుంది అని" అంటే నువ్వు ఇప్పుడు బాగా ఉన్నవ్ కావచ్చు బాగా డబ్బు,పరపతీ అన్ని ఉన్నాయి కావచ్చు కానీ రేపు ఎం అవుతుందీ ఎవరికి తెలియదు కదా మళ్ళీ జీవితంలో కిందికి పడి పోతావ్ కావచ్చు అప్పుడు ఎలా అందరితో కలిసి ఉంటావు.నీ కన్న తక్కువ స్థాయి వారు మంచి స్థాయి కి రావచ్చు  అప్పుడు వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు. నువ్వు అందరితో మంచిగా లేకుండా పొగరు గా ఉంటే. ఎప్పుడు మనమే మొదట నవ్వుతూ పలకరిస్తే తప్పు ఎంటి ??యోగ క్షేమాలు అడిగితే తప్పు ఎంటి??? ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు నీ గుణం తో ఎప్పుడు నువ్వు అందరి మనసులో గొప్పగానే ఉంటావు జీవితం లో డబ్బు ఉన్న లేకపోయినా ఎం అయిన సరే నిన్ను ఎదుటివారు మంచిగానే చూస్తారు ,ఇంకా ఇంట్లో వారు మనల్ని గుర్తించడం లేదు అని చాలా బాధ పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు..ఒక జడ్జి ఉంటారు ఇంట్లో ఎదైనా విషయం జరిగినప్పుడు భార్య ఎం అంటుంది ఊరుకోండి మీకు ఎం తెలియదు అని ...ఒక అమ్మ ఉంటుంది పిల్లలు ఎం అంటారు ఏమైనా ఉంటే అమ్మ నీకు తెలియదు ఊరుకో అని మన వల్ల దృష్టి లో మనం ఎప్పుడు గొప్పవాళ్ళు అనే ముద్ర వేయలేము .మన అన్న స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి ,అక్కడ ప్రేమ ఉంటుంది గౌరవం కాదు....మనం ఎం చేసిన మన కోసం మన సంతోషం కోసం చేయాలి అంతే కానీ ఎవరి మెప్పు కోసం కాదు ఎవరు గుర్తించిన గురించకపోయిన మన పని మనకి సంతోషం ఇవ్వాలి....మనల్ని మనం ప్రేమించాలి మన పనిని ప్రేమించాలి అంతే ....

Comments

Popular posts from this blog

జరగబోయేది ఎలాగూ జరుగుతుంది మరి జ్యోతిష్యం ఎందుకు?????

జాతకం అంత బాగున్న మనకి ఎందుకు అన్నీ కష్టాలే వస్తున్నాయి.

అమ్మ