ఓపిక అవసరమా?????

ఇప్పుడు మనం ఉన్న సమాజం లో ఎవరికి ఓపిక ఉండడం లేదు ....అస్సలు ఓపిక అవసరమా???

మన పురాణ కథలలో కొన్ని కథలు ఉంటాయి ,ఒక రెండు కథలు నాకు చాలా ఇష్టం అవి ఎంటి అంటే ఒకటి కద్రువ,వినత కథ అధి ఎంటి అంటే కశ్యపుడు నికి కద్రువ వినత ఇద్దరు కూడా భార్యలు. మంచిగా ఇద్దరు కూడా స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారు ,స్వామి తపస్సు కి వెళ్తూ ఇన్ని రోజులు నన్ను సేవించారు కదా మీకు ఎం కావాలి అని అడిగితే బిడ్డలు కావాలి అని అడుగుతారు అప్పుడు స్వామి ఇద్దరికీ గుడ్లు ఇస్తాడు. కద్రువ కి నీకు 1000 మంది భయంకర సర్ప రూపాలు కొడుకులు గా పుడతారు ,వినత కి 2 పరాక్రమవoతులు అయిన కొడుకులు పుడతారు అని చెప్పి వెళ్తారు .కద్రువ కి కొడుకులు పుడుతారు .తను వాళ్ళతో హ్యాపీ గా ఉంటుంది ,వినత కి ఎం చేయాలో అర్థం కాక ఓపిక లేక తనకి ఇచ్చిన 2 గుడ్లూ లలో ఒక గుడ్డు నీ పగలగోట్టుతుంది అప్పుడు సగం శరీరం మాత్రమే ఏర్పడిన అనూరుడు బయటికి వచ్చి మూర్ఖంగా మీ అక్కని చూసి ఓర్చుకొలేక నేను ఇలా అసంపూర్తిగా పుట్టడానికి కారణం అయ్యావు అని తనని శపించి సూర్య భగవాన్ కి రథ సారథి గా వెళ్ళిపోతారు.తొందర పడి ఇంకో గుడ్డు నీ పగల గొట్టకు అతి శక్తి వంతం అయిన గరుత్వంతుడు పుడతారు నీ శాప విమోచనం తానే చేస్తాడు అని చెప్తాడు . తర్వత  మొత్తం కథ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను మొత్తం చెప్పడం లేదు
ఇక్కడ వినత ఓపిక గా ఉండి ఉంటే తనకి ఇద్దరు పిల్లలు ఉండేవారు తను అక్కకి దాస్యం చేసే కర్మ ఉండేది కాదు అంత చక్కగా ఉండేది కదా ..ఓపిక పట్టనందుకు తన జీవితం మొత్తం తను శిక్ష అనుభవించిoది.
ఇంకో కథ మహాభారతం లో కుంతి , గాంధారి కథ దుర్వాస మహర్షి ఇద్దరికీ పిల్లలు పుట్టే వరం ఇస్తారు .కుంతి మాత కి ధర్మరాజు పుడతారు తనకి ఇంకా పుట్టడం లేదు అని అసూయ తో కడుపు పైన కొట్టుకుంటుంది అప్పుడు గర్బస్రావం అయి పిండం ముక్కలు అయి కింద పడిపోతుంది అప్పుడు అన్ని ముక్కలని నేతి కుండలలో వేసి భద్రపరుస్తారు. కాలి ప్రభావం తో పిల్లలు పుట్టి అధర్మ మార్గంలో నడిచి అందరూ చచ్చిపోతారు. తాను ఓపిక పట్టి ఉంటే కథ వేరేలా ఉండేది కావచ్చు.

ఇలా నిజ జీవితం లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము.ఓపిక లేకుండా చాలా పనులు చేసి జీవితం మొత్తం కష్టపడుతారు. ఏ విషయం అయిన జీవితం లో కొంచం సమయం తీసుకొని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఒక రోజు ఒక నెల ఓపిక గా ఉంటే నీ జీవితం మొత్తం సంతోషం గా ఉంటుంది.కొంతమంది కి ఇంకా కాస్త టైం ఎక్కువ పట్టచ్చు. కానీ ఓపిక పట్టి చూడు చాలా అద్భుతాలు జరుగుతాయి....మనం పుట్టడానికే 9 నెలలు తప్పకుండా అగాలి ప్రపంచం చూడడానికి మనం ,మనల్ని చూడడానికి అమ్మ ఓపిక పట్టాలి  కదా ... తర్వత చూసిన క్షణం ఎంత సంతోషం ఉంటుంది అమ్మకి ..విత్తనం వేసి రోజు కుండలు కుండలు నీళ్ళు పోస్తే మొక్క రాదు గా ఓపిక పట్టాలి ,చిన్న మొక్క బయటికి వచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది ...ఇలా ప్రతిదీ ఓపిక పడితే చివరికి సంతోషం అయితే ఉంటుంది

Comments

Popular posts from this blog

జరగబోయేది ఎలాగూ జరుగుతుంది మరి జ్యోతిష్యం ఎందుకు?????

జాతకం అంత బాగున్న మనకి ఎందుకు అన్నీ కష్టాలే వస్తున్నాయి.

అమ్మ