మంచిమాట- gossips
మనం నిత్య జీవితంలో office లో కానీ ఇంట్లో కాని ఇంటి పక్కవారి తో కానీ మాట్లాడుతూ ఉంటాము.మాట్లాడే సమయం లో మనం ఎక్కువగా చేసే పని అక్కడ లేని వారి గురించి ఎదో ఒకటి మంచిగా లేదా చెడు గా మాట్లాడుకోవడం ....మనలో చాలా మంది మంచి కంటే చెడు ఎక్కువగా మాట్లాడుకుంటాం.అల మాట్లాడుకుంటే ఎం వస్తుంది ఏమో ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని ఇస్తుంది కావచ్చు....ఒక గాసిప్ ఒకరి జీవితం నీ ఎంత ప్రభావితం చేస్తుంది కూడా మనం తెలియదు దానివల్ల వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడి,మానసిక క్షోభను అనుభవిస్తారు అనేది మనకి తెలియదు అస్సలు మనకి అవసరం లేదు మనకి టైం గడవాలి కాబట్టి మాట్లాడుకోవాలి.........
ఒక ఉదాహరణ చెప్తాను నిత్య జీవితంలో నేను చూసింది విన్నదే ,నాలాగే చాలా మంది విని ఉండవచ్చు ,ఈరోజు ఒక్క ఉదహరణ చెప్తాను.ఒక భార్య భర్త ఉండేవారు ,అమ్మాయ్ కాస్త నలుపు అబ్బాయ్ కాస్త తెలుపు...ఇంకా వాళ్ళని చూసి అబ్బా అమ్మాయ్ నీ ఎలా చేసుకున్నాడు ,వరకట్నం చాలా ఇచ్చి ఉంటారు..జోడీ అస్సలు బాగాలేదు.ఇలా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి చాలా చెత్త చెత్త మాటలు కూడా అంటూ ఉంటారు ,ఎలా అయిన వాళ్ళకి ఈ మాటలు తెలుస్తాయి కదా అప్పుడు అమ్మాయ్ ఎంత బాధ పడుతుంది అస్సలు భర్త తో కలిసి బయటికి వెళ్ళాలి అంటే కూడా భయపడుతుంది ....మానసికంగా మీ వల్ల ఆ మాటల వల్ల ఒక అమ్మాయి మానసిక ఒత్తిడి కి గురి అవుతుంది ......కాపురం చేసే భర్త కే సమస్య లేదు చూసేవాళ్ళకి ఎందుకు అంత బాధ .....ఇలా చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సమయం గడవడనికో లేదా మానసిక పైశాచిక ఆనందం కోసమో .....
ఇలా చేయడం వల్ల మీకు ఒకర్ని బాధ పెట్టిన కర్మ వస్తుంది .జ్యోతిష్యం ప్రకారం జాతకం లో శుక్ర గ్రహం ఆడవారిని సూచిస్తుంది ఇలా వేరే ఆడవారి బాధ కి కారణం అవుతున్నారు కాబట్టి మీకు శుక్ర గ్రహ దోషాలు కలిగి అనేక రకాల సమస్యలు రావడం మీ ఇంట్లో ఆడపిల్లలు బాగా లేకపోవడం లేదా వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండకపోవడం మీకు డబ్బు సమస్యలు ,చర్మ సమస్యలు రావడం ఇలా చాలా సమస్య లు వస్తాయి కాబట్టి అల మనకు సంబందం లేని మనుషుల గురించి వాళ్ళ జీవితల గురించి మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది.....కొంచం ఈ విషయం గురించి అలోచించి మారుతారు అని అశిస్తు....... మీ రజితశ్రీ
Chala Baga cheparu andi..
ReplyDelete