అమ్మ
ఈ కథ నేను ఎప్పుడో విన్న కథ,చాలా మందికి తెలిసిన కథ కావచ్చు చాలామందికి తెలియల్సిన కథ కావచ్చు ... అనగనగా ఒక రాజ్యం లో ఒక అబ్బాయి ఉండేవాడు ,తనకి తండ్రి లేరు చిన్నపుడు యుద్ధం లో చనిపోతారు ,అమ్మ చాలా కష్టపడి అబ్బాయ్ నీ పెంచుతుంది.అల రోజులు గడుస్తున్నాయి .అమ్మ ముసలిది అవుతుంది ,ఒకరోజు అబ్బాయ్ నీ అమ్మ పిలిచి ఈ ఒక్కరోజు నా పక్కన పడుకో నాన్న అంటుంది ,దానికి ఎం ఉంధి అమ్మ అలాగే పడుకుంటాను అని పడుకుంటాడు అమ్మ అంటుంది నాన్న ఈరోజు నేను ఎం చేసిన విస్సుకోవు కదా మాట ఇవ్వు అంటుంది ,అమ్మ నేను ఎందుకు విస్సుకుంటను ,అస్సలు అల చేయను అంటాడు లేదు నాన్న మాట ఇవ్వు అంటుంది సరే అమ్మ నేను ఎం అనాను అని మాట ఇస్తాడు ,అమ్మ నాన్న లేకపోయినా నన్ను ఇంత వాడిని చేశావు నిన్ను కంటికి రెప్పల చూసుకుంటాను అస్సలు ఎం అనను అని చెప్తాడు ,సరే నాన్న నా బంగారం అని అమ్మ అంటుంది ,సరే అమ్మా పడుకో ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు అప్పుడు అమ్మ నాన్న నాకు ఎదైనా ఒక కథ చెప్పవా అని అడుగుతుంది .నీకు కథ ఎందుకు అమ్మ అని అంటాడు నాకు వినాలి అనిపిస్తుంది రా చెప్పు అంటే సరే అని చెప్తాడు ,ఇంకోటి చెప్పు నాన్న అంటుంది కొంచం అయిష్...